ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకంతో పటిష్టమైన బాధ్యతలను అప్పగించినందుకుగాను మంత్రి బిసి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.