గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామంలోని ఏపీ ఆగ్రోస్ సెంట్రల్ వర్క్ షాప్ ను బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు సందర్శించారు. ఈ కేంద్రంలో తయారయ్యేటువంటి వ్యవసాయ యాంత్రిక పరికరాలైన రోటోవేటర్లు, సీడ్ డీల్స్, కల్టివేటర్స్, మల్చర్, రౌండ్ బేలర్స్, స్క్వేర్ బేలర్స్, తదితర పరికరాలను పరిశీలించారు. అలాగే అక్కడ సిబ్బందితో ఆయన మాట్లాడారు.