కావలి: ఆటో నుంచి కింద పడి వ్యక్తి మృతి

83చూసినవారు
కావలి: ఆటో నుంచి కింద పడి వ్యక్తి మృతి
నెల్లూర్ జిల్లా కావలి- తుమ్మలపెంట మధ్యలో ఆటోలో వెళ్తూ ప్రమాదవశాత్తు కావలి మండలం కొత్తసత్రం గ్రామానికి చెందిన డోకి రవి కుమార్ (36) కింద పడ్డాడు. దీంతో అతనిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్