తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కుమారుడు వివాహ వేడుకలో ప్రముఖులు పాల్గొంటున్నారు. నెల్లూరు కనుపర్తిపాడు వద్ద ఉన్న విపిఆర్ కన్వెన్షన్ లో జరుగుతున్న వివాహ వేడుకకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర కలిసి హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.