2023-24, 2024-25 సంవత్సరాలకు గాను కావలి రెడ్ క్రాస్ రక్త కేంద్రం ద్వారా నిర్వహించిన శిబిరాలకు 5 అవార్డులు లభించాయి. అవార్డులను ప్రపంచ రక్తదానం దినోత్సవం సందర్భంగా విజయవాడలో అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ని ఆదివారం కలిసి సత్కరించి, రెడ్ క్రాస్ సాధించిన మెడల్స్, ట్రోఫీ లను ఆయన చేతులమీదుగా అందుకున్నారు. రెడ్ క్రాస్ సభ్యులను ఆయన అభినందించారు.