ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విద్యార్థులను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 991/1000 మార్కులతో ద్వితీయ స్థానంలో, కావలి పట్టణంలో మొదటి స్థానంలో నిలిచిన యస్ కె. సోనియా సుల్తానాను, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు బి. చైతన్య 464/470, ఐ. రీతుప్రియలను 464/470 ఆయన అభినందించారు.