కావలి: క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచిపెట్టిన ఎమ్మెల్యే

76చూసినవారు
కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, చుట్టుపక్కల నుంచి ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వారందరికీ పంచిపెట్టారు. అందరికీ ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్లు అందరూ సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్