టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేపట్టారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.