కావలి బృందావన కళ్యాణ మండపంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డికి మెప్మా, ఐసిడిఎస్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. వృత్తిలో నిబద్ధత ప్రతిభ కనబరిచిన మహిళలను ఎమ్మెల్యే సత్కరించారు.