కావలి రూరల్ మండలం పెద్దపట్టపు పాలెం లోని శ్రీశ్రీశ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర, శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరునాళ్ళ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి శనివారం పాల్గొన్నారు. పార్వతమ్మ, రాములవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోఅన్నీ వీధుల్లో సీసీ రోడ్లు వేయిస్తానన్నారు. కరెంట్ సమస్య తలెత్తకుండా నూతన విద్యుత్ స్థంబాలు, లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.