ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. రైతు దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక అన్నారు. కావలి మండలం గౌరవరంలో సీ. ఎం. ఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఖాదీ కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ అవసరం వచ్చిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.