కావలి - తుమ్మలపెంట రోడ్డు పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అధికారులు, స్థానిక టిడిపి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడవద్దని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్దేశించిన సమయానికి రోడ్డు పూర్తి చేయాలని తెలిపారు.