శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న మహా చండీ యాగానికి విచ్చేయవలసిందిగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు పత్రి వీర బ్రహ్మయ్య స్వామి శనివారం ఆహ్వానించారు. కావలి ఎమ్మెల్యే నివాసంలో కలిసి మహా చండీ యాగం కు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు.