అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీ అనగా ఆదివారం రోజున నెల్లూరులో ఎస్బిసి కళ్యాణమండపం నందు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ని శనివారం నిర్వహకులు కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు.