తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కావలి పట్టణం లోని శ్రీ గీతా మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ పరమాత్మకు సామూహికముగా లక్ష తులసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసి సేవలో పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ఎమ్మెల్యే కోరుకున్నారు.