నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ ప్రాంగణంలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పై ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి MLA దగుమాటి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ వెన్నెల, డాక్టర్లు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి సన్మానించారు. డాక్టర్స్ తో కలిసి రెడ్ క్రాస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.