9వ శ్రీశ్రీ గౌర నితాయ్ (కృష్ణ - బలరామ్) రథయాత్రను కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రథయాత్ర కావలి పట్టణంలో ఘనంగా జరిగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కు ఇస్కాన్ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆయన రథంతో పాటు నడిచారు. పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రథయాత్రలో పాల్గొన్నారు.