అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం కావలి రూరల్ మండలం గౌరవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయానికి సంబందించిన 79 విద్యుత్ కనెక్షన్లకు స్విచ్ ను ఆన్ చేశారు. రూ. 60 లక్షలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సచివాలయంను, ఆరోగ్య కేంద్రంను, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు.