నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆనేమడుగులో శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికి డప్పుల వాయిద్యాలు, పకీరుల జరాబులు మధ్య ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గంధ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.