కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం యానాదిశెట్టి చిత్రపటానికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాదిశెట్టి చేసిన సేవలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనియాడారు.