కావలి పట్టణం పాత హరిజనవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఎల్లంటి శ్రీనివాసులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే పలువురు టిడిపి నాయకులు సైతం నివాళులర్పించారు.