నెల్లూరు లో షైనింగ్ స్టార్స్ - ప్రతిభా పురస్కారాలు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి హాజరై ఎంపీ వేమిరెడ్డితో కలిసి విద్యార్థులకు అవార్డులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో 250 మంది, ఇంటర్లో 34 మంది మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఒక్కొక్కరికి రూ. 20వేలు నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.