నెల్లూరులోని కలెక్టరేట్‌లో పలు శాఖల పనితీరుపై అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలని, నోషనల్ ఖాతాల పరిధిని ఆర్డీవో స్థాయికి తీసుకురావాలని కోరారు. సిజెఎఫ్‌ఎస్ భూములను రద్దు చేసి ప్రభుత్వ భూమిగా మార్చడం వలన రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందలేకపోతున్నారన్నారు.