అమరావతి లోని అసెంబ్లీలో గురువారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీ లో మాట్లాడారు. ల్యాండ్ కన్వర్షన్ ద్వారా రెట్టింపు ఛార్జీలు చెల్లించి నష్టపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఒకేసారి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఉండేలా చేయాలని అసెంబ్లీలో క్రిష్ణారెడ్డి ప్రశ్నించారు. దానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు.