కావలి పట్టణం బృందావనం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆవిష్కరించారు. శనివారం బృందావనం కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆలయ కమిటీ సభ్యులతో కలసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ముక్కోటి రోజు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే కోరారు.