కావలి పట్టణం ముసునూరు 15వ వార్డులో ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంగళవారం రాత్రి సమయంలో ఇల్లు దగ్ధమైంది. దాసరి వెంకట నరసయ్య నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 17 సవర్ల బంగారం 6 లక్షల నగదు గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించారు.