కావలి నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం తనకు ఎంతో కలిసి వచ్చిందని ఎమ్మెల్యేగా కావలి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. 2025 సంవత్సరంలో కావలి నియోజకవర్గం ప్రజలందరి కుటుంబాలలో సుఖసంతోషాలు వెళ్ళు విరవాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.