కావలి: పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ బీద

81చూసినవారు
కావలి: పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ బీద
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ, కావలి టిడిపి నేత బీద రవిచంద్ర పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాక మునుపే సమాజంలోని పీడిత, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు.

సంబంధిత పోస్ట్