బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం పరిధిలోని అల్లూరు, దగదర్తి, బిట్రగుంట మండలాల్లో శుక్రవారం మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం నుంచి ఓ మోస్తారు వర్షం కురవ సాగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే భారీ ఈదురుగాలులు సైతం విచాయి.