కావలి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. కావలి మండలం బట్లదిన్నె గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపల్లి నాగమ్మ (63) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నాగమ్మ సజీవ దహనమయ్యారు. స్థానికులు గుర్తించి అక్కడికి చేరుకునే లోపే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా నాగమ్మకు నలుగురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. పెద్ద కుమార్తే దగ్గర ఆమె ఉంటుంది.