నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వరికుంటపాడు, కావలి, అల్లూరు, మర్రిపాడు, సంఘం, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాల వ్యాప్తంగా ముమ్మరంగా రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు నిండడంతో పాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో మోటార్లలో నీరు పుష్కలంగా వస్తుంది. దీంతో రైతులు వరి నాట్లు మొదలుపెట్టారు.