కావలి: ఎమ్మెల్యేను కలిసిన ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు

82చూసినవారు
కావలి నియోజకవర్గ రైతులు, ప్రజలు తన పై, కూటమి ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లు శనివారం ఆయనను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి సత్కరించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. భారీగా విచ్చేసిన వారితో టిడిపి కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.

సంబంధిత పోస్ట్