కావలి బిజెపి పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. కావలి మున్సిపాలిటీలోని పలు సమస్యలను వినతి పత్రంలో పొందుపరిచి అందజేశారు. పారిశుద్ధ్యం, నీరు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దీనికి మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ. త్వరితగిన సమస్యలన్నీ పరిశీలించే విధంగా చూస్తామని తెలిపారు.