తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి కి పితృవియోగం కలిగింది. బీద రవిచంద్ర సతీమణి జ్యోతి, మాజీ కార్పొరేటర్ పొన్నెబోయిన ఓం ప్రకాష్ ల తండ్రి పొన్నేబోయిన సుందర రామయ్య సోమవారం మధ్యాహ్నం స్వర్గస్తులయ్యారు. మంగళవారం ఉదయం 10: 30 గంటలకు మైపాడు రోడ్డు లోని మారుతి నగర్ 2వ వీధి ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న వారి నివాసం నుండి అంతిమయాత్ర జరగనుంది.