కావలి మండలం పరిధిలోని మద్దూరుపాడు, తుమ్మలపెంట, చెన్నాయి పాలెం 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నందు శనివారం మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కావలి రూరల్ ఏఈ చేజర్ల శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 8: 30 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులందరూ గమనించి సహకరించాలని కోరారు.