తొలిసారి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పై కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకం నిధులను దారి మళ్లించి ప్రజలు మరిచిపోయేలా చేసేందుకే పైలాన్ విధ్వంసం చేశారు. పాత్రికేయుల పేరు చెప్పి విధ్వంశానికి పాల్పడ్డారు. అమృత్ పథకం అవినీతిని త్వరలో బయటపెడతానన్నారు. సుమారు 57 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగని త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు.