కావలి: నివాసాల్లోకి వస్తున్న పాములు

69చూసినవారు
కావలిలోని కచేరి మెట్టలో ఓ పాడు బడిన ఇంటిలో చెట్లు, చెత్తాచెదారం అద్వానంగా ఉండడంతో విష సర్పాలకు నిలయంగా మారింది. చుట్టుపక్కల ఉండే నివాసాల్లోకి పాములు వెళ్తుండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలోనూ ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా మరోసారి ఇళ్లల్లోకి పాములు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్