నెల్లూరు జిల్లా కావలి ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో ఐఓఎస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజలు, టిడిపి నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికే కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మార్వో ను కలిసి పెట్రోల్ బంకు నిర్మాణం నిలుపుదల చేయాలంటూ స్థానిక టిడిపి నాయకులు విజ్ఞప్తి చేశారు.