991 మార్కులతో రాష్ట్రస్థాయిలో మెరిసిన కావలి విద్యార్థిని

67చూసినవారు
కావలి కి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మెరిసింది. కె. లక్ష్మీ హరిత అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కావలిలోని ఒక కళాశాలలో చదువుతుంది. శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో 1000 కి 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఆ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులతో పాటు కావలి ప్రజలందరి అభినందనలు దక్కాయి.

సంబంధిత పోస్ట్