కావలి పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో గురువారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు, పలువురు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. సభ్యత నమోదుపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. భారీ సభ్యత్వాల దిశగా ముందు సాగాలన్నారు.