కావలి పట్టణంలో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100 రూపాయలు రుసుము చెల్లించి టిడిపి సభ్యత్వాన్ని పొందితే, సభ్యత్వం పొందిన వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ చురుగ్గా వ్యవహరించాలన్నారు.