నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ని కావలి బిజెపి నేతలు కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ప్రతి శనివారం బస్సు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి విన్నపాన్ని మన్నించిన సన్నపురెడ్డి ప్రతి శనివారం బిలకూట క్షేత్రానికి ఆర్టిసి బస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు సన్నపురెడ్డికి సోమవారం ధన్యవాదాలు తెలిపారు.