కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయానికి సంబందించిన 79 నూతన విద్యుత్ కనెక్షన్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం 60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు గ్రామానికి సంబందించిన పలు సమస్యలు పరిశీలిస్తారు. 4 గంటలకు సచివాలయం వద్ద గ్రామస్తుల నుండి వినతులు స్వీకరిస్తారు.