దగదర్తి మండలం దామవరం ఎయిర్పోర్ట్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి నెల్లూరు జిల్లా ఒక దిక్సూచిలా మరనుందన్నారు. 2019 జనవరి 6న సీఎం హోదాలో చంద్రబాబు విమానాశ్రయం ఏర్పాటుకు భూమి పూజ చేశారన్నారు.