కావలిలో శుక్రవారం గంజాయి అమ్ముతున్న ఏడుగురు పట్టుబడిన విషయం తెలిసిందే. డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ పెదపవని రోడ్డులో నలుగురు, వైకుంటపురం రైల్వే బ్రిడ్జి వద్ద ముగ్గురుని పట్టుకున్నామని, ఇందులో ముగ్గురు కావలి వారు, నలుగురు ప్రకాశం జిల్లా వాసులు అని తెలిపారు. రాజమండ్రి నుంచి కావలికి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు డిఎస్పి తెలిపారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. విద్యార్థులే వీళ్ళ టార్గెట్ అని అన్నారు.