కావలి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబడిన ఏపీ టిట్కో గృహాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కావలి పరిధిలో ఎవరికైనా టిట్కో గృహాలు కేటాయింపబడి, వారికి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్లు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలని, లేకపోతే ఆ గృహాలు వేరే వారికి కేటాయింపబడతాయని తెలిపారు.