కావలి: ముగిసిన నలుగురు విలేకరుల విచారణ

52చూసినవారు
కావలి: ముగిసిన నలుగురు విలేకరుల విచారణ
2020లో కావలి పట్టణంలోని అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో రిమాండ్ లో ఉన్న నలుగురు విలేకరులను కావలి రెండవ పట్టణ పోలీసులు కష్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం విచారణ ముగియడంతో నలుగురు విలేకరులను తిరిగి కావలి సబ్ జైలుకు తరలించారు. వీరి రిమాండ్ ఈనెల 16వ తేదీ వరకే ఉండడంతో బెయిల్ కోసం సోమవారానికి విలేకరుల తరపున లాయర్ వాయిదా కోరారు. ఈ కేసులో తర్వాత అరెస్టు కాబోయేది ఎవరు, ఎంతమంది అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్