మహాత్మా జ్యోతి రావ్ పూలే వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కావలి ట్రంక్ రోడ్డులోని మహాత్మా జ్యోతి రావ్ పూలే కాంస్య విగ్రహం వద్ద టిడిపి నాయకులు విగ్రహానికి నివాళులర్పించారు.