ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా వైకుంఠపురం వద్ద ఫ్లైఓవర్ కి బదులుగా అండర్ బ్రిడ్జిని నిర్మిస్తామని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. కలుగోలమ్మ తిరుణాళ్ళలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. జనవరి లోపు వైకుంఠపురం వద్ద అండర్ పాస్ నిర్మించడం జరుగుతుందన్నారు. అండర్ పాస్ నిర్మించడం వలన ఉత్సవాలు, జాతరలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.