సాక్షి టీవీ ఛానల్ మూసేయాలని డిమాండ్ చేస్తున్న కావలి మహిళలు

60చూసినవారు
సాక్షి ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. కావలి సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా నేతలు మాట్లాడుతూ మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని, సాక్షి టీవీ ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్